కాకుమాను మండలం కొండపాటూరులో బుధవారం గడ్డి ట్రాక్టర్ పై కరెంటు తీగలు తగిలి కాలిపోయింది. స్కీమ్ కు వెళ్లే మార్గంలో కింద పడిన విద్యుత్ తీగలు గడ్డిని తాకడంతో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే పలు రోజులుగా తీగలు నేలపై ఉండటాన్ని విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.