గుంటూరు జీఎంసీ పరిధిలో ఆస్తి, నీటి పన్ను బకాయిల వసూళ్ల పై అడ్మిన్ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్ స్పెక్టర్లతో ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్లో డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, ఇన్స్ స్పెక్టర్లతో ఆస్తి, ఖాళీ స్థల పన్ను, నీటి మీటర్ల ఛార్జీల వసూళ్లు వేగవంతంపై సమీక్షా సమావేశం జరిగింది. కమిషనర్ అధికారులకు పలు అంశాల పై దిశానిర్దేశం చేశారు.