గుంటూరు జిల్లా జైలులో ఉన్న పోసాని కృష్ణమురళీతో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గురువారం మధ్యాహ్నం ములాఖత్ అయ్యారు. ప్రభుత్వం 17 కేసులు పెట్టి పోసానిపై కక్ష సాధిస్తుందని మండిపడ్డారు. జైలులో ఉన్న పోసాని ప్రభుత్వం తనను చంపేస్తుందేమో అని భయపడుతున్నారని, తన కుమారుల గురించి ఆలోచిస్తున్నారని అంబటి అన్నారు.