గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెయిన్ రోడ్డు పై ఉన్న కాంపౌండ్ వాల్ ను తీసివేసి 12 అడుగులు వెనుక వైపుకు గోడ నిర్మాణానికి మార్కింగ్ వేస్తూ బుధవారం శ్రీకారం చుట్టారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి అడ్డువచ్చిన ఈ గోడను తొలగించి వెనుక వైపుకు మళ్ళిస్తున్నామని మునిసిపల్ కాంట్రాక్టర్ తెలిపారు.