ఏపీ రాష్ట్రంలో ఎక్కడైనా సర్వర్ సమస్య ఉన్నా సరుకుల పంపిణీని ఆపొద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఫొటో, సంతకం తీసుకొని లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వాలని డీలర్లను ఆదేశించారు. ప్రజల నుంచి విమర్శలు రాకుండా సజావుగా పని చేయాలని సూచించారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ చేయాలని నాదెండ్ల మనోహర్ అన్నారు.