టీడీపీ కార్యకర్త కీర్తన్‌పై దాడి చేసిన ఘటనపై సంబంధించి నలుగురు పోలీస్ స్టేషన్లో గోరంట్ల మాధవ్‌ను విచారిస్తున్నారు. అయితే పోలీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దురుసుగా ప్రవర్తించారు. ఆయన మీడియా ముందుకు రావటానికి నిరాకరించారు. ఎంపీగా పని చేసిన వ్యక్తిని మీడియా ముందు పెడతారా అంటూ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గోరంట్ల మాధవ్ కోర్టులో హాజరయ్యారు.