అన్ని రంగాల కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమయ్యా యని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి అంజిబాబు విమర్శించారు. మే 20న జరగనున్న సార్వత్రిక సమ్మెలో సివిల్ సప్లయిస్ ముఠా కార్మికులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ మేరకు సహకరించాలని కోరుతూ మంగళవారం సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జిల్లా డీఎం గిడ్డి లక్ష్మికి నోటీసు అందజేశారు.