గుంటూరు పట్టణంలో గురువారం కురిసిన వర్షానికి గుంటూరు జి జి హెచ్ వైద్యశాలలోని ఎమర్జెన్సీ వార్డులోకి వర్షపు నీరు చేరింది. వార్డులోని రోగులు వారి అటెండర్స్ వర్షం నీరు ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు వార్డుల్లో చేరిన నేపథ్యంలో ఇన్ పేషెంట్లకు ఎక్కడ వైరస్ సోకి ప్రాణాంతకర వ్యాధులు ప్రబలుతాయోనని ఆందోళన చెందుతున్నారు. వైద్యశాల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శానిటేషన్ సిబ్బంది నీరును తొలగించారు.