గుంటూరు: జీతాల పెంపు కోరుతూ గుంటూరు కార్మికుల సమ్మెకు పిలుపు

70చూసినవారు
గుంటూరు: జీతాల పెంపు కోరుతూ గుంటూరు కార్మికుల సమ్మెకు పిలుపు
జూలై 22 అర్ధరాత్రి నుంచి గుంటూరు నగరపాలక సంస్థ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్, శానిటరీ ట్రేడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు ఈ మేరకు అసిస్టెంట్ కమిషనర్‌కు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. జీతాల పెంపు లేకపోవడం, సమస్యల పరిష్కారంలో జాప్యం పట్ల నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమ్మెతో నగరంలో పారిశుద్ధ్య, వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్