గుంటూరు జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ G. వీరయ్య మృతి చెందిన నేపథ్యంలో 2012 బ్యాచ్ స్నేహితులు రూ. 1, 63, 000 ఆర్థిక సాయాన్ని అందించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ చేతుల మీదుగా వీరయ్య కుటుంబంతోపాటు, క్రాంతి కుమార్ కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున చేయూత పథకం కింద రూ. 1 లక్ష చొప్పున పంపిణీ చేశారు. ఎస్పీ కానిస్టేబుళ్ల ఐక్యతను ప్రశంసించారు.