గుంటూరు జిల్లా ప్రజలు స్నేహపూర్వక వాతావరణంలో మత సామరస్యానికి ప్రతీకగా హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ గురువారం సూచించారు. ఇతర మతస్థుల వ్యక్తిగత స్వేచ్ఛను, వారి మతాచారాలను గౌరవిస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆకతాయి చేష్టలకు, అల్లర్లకు తావివ్వకుండా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చేయాలన్నారు.