జాతీయ రీ సర్వే వర్క్షాపు గురువారం గుంటూరులో నిర్వహించబడింది. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో 6, 688 గ్రామాల్లో రీ సర్వేలో తీవ్ర తప్పులు జరిగాయని, పేదల భూములకు అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తొలిదశలో 628 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, రెండో దశలో 758 గ్రామాల్లో సర్వే కొనసాగుతోందని పేర్కొన్నారు.