మహాత్మా జ్యోతిరావ్ పూలే ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరీఫాతీమా పిలుపునిచ్చారు. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, పార్టీ శ్రేణులతో కలిసి ఆమె ఎంటీబీ సెంటర్ లోని పూలే విగ్రహానికి పూలమాలవేసి గురువారం నివాళులర్పించారు. సావిత్రి భాయ్ పూలే ద్వారానే సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టిన మహానీయులు జ్యోతిరావ్ పూలే అని అన్నారు.