కొందరు పోలీసుల తీరు బాగోలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెర్రరిస్టును తీసుకొచ్చినట్లు కాకాణిని తీసుకొచ్చారన్నారు. ఎవరినీ కలవనివ్వలేదని, కోర్టు హాలులోకి తమను వెళ్లనివ్వలేదన్నారు. అధికారంలో లేనివాళ్లపై ఫాల్స్, అట్రాసిటీ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పైన ఖాకీ చొక్కా, లోపల పచ్చ చొక్కాలేసుకుని అడ్డగోలు కేసులు పెడుతున్నారన్నారు.