గుంటూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

53చూసినవారు
గుంటూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
గుంటూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అతివేగంగా వెళ్తున్న లారీ ముందుగా వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టింది. ఘటనలో స్కూటీ మీద ఉన్న వ్యక్తి లారీ కింద పడి సంఘటన స్థలంలోని ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మిర్చి యార్డు వద్ద ఉన్న కొత్తకాలనీకి చెందిన దొడ్డ రత్నాకర్ రావు(64)గా గుర్తించారు. ఇతను మిర్చి యార్డులో గుమస్తా.

సంబంధిత పోస్ట్