కర్లపాలెం మండలం ప్యార్ లీ పంచాయతీ పరిధిలోని మల్లెల వారి పాలెం, బక్క వారి పాలెం గ్రామాల్లో బుధవారం ఉపాధి హామీ పనులను మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వలసలు వెళ్లకుండా స్థానికంగా ఉపాధి పొందాలని సూచించారు. అవసరమైన ఔషధాలు, నీటి సదుపాయాలు కల్పించామని తెలిపారు.