గుంటూరు జిల్లాలోని యూపీహెచ్ సీల్లో మెడికల్ ఆఫీసర్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, సోషల్ వర్కర్స్, డెంటల్ టెక్నీషియన్, ఎల్ జి ఎస్ ఔట్సోర్సింగ్ పోస్టుల మెరిట్ జాబితాను డీఎంహెచ్వో విజయలక్ష్మి బుధవారం విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను మే 20 సాయంత్రం 5 గంటల లోపు డీఎంహెచ్వో కార్యాలయంలో సమర్పించాలని, గడువు దాటితే స్వీకరించమని ఆమె సూచించారు. వివరాలు guntur.ap.gov.inలో అందుబాటులో ఉంటాయన్నారు.