గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10 వార్డ్ అర్బన్ హెల్త్ సెంటర్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొని శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంపౌండ్ వాల్ నిర్మాణం ఆరోగ్య కేంద్రం భద్రతను పెంచడమే కాకుండా, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలకమైనది అని తెలిపారు.