గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ మంగళవారం ఉదయం 15వ డివిజన్‌లోని కొబ్బరికాయల సాంబయ్య కాలనీలో పర్యటించారు. ఈ సందర్బంగా అక్కడ మంచినీటి సమస్యతో బాధపడుతున్నామని మహిళలు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపుల నీటి సరఫరా వచ్చే వరకు ట్యాంకర్లతో నీరు పంపించాలని అధికారులను ఆదేశించారు.