గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10వ వార్డ్ అర్బన్ హెల్త్ సెంటర్ ను శుక్రవారం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యులు రోగులకు సమయానుకూలంగా సేవలు అందించేందుకు తగు సూచనలు ఇచ్చారు. హెల్త్ సెంటర్ లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.