గుంటూరు: జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్

76చూసినవారు
గుంటూరు: జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్
కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కట్టుబడిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ అన్నారు. బుధవారం కొత్తపేటలో జలగం రామారావు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. వివిధ సంస్థలు పాల్గొన్న ఈ మేళాలో యువత అధిక సంఖ్యలో హాజరై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్