గుంటూరు: ప్యాచ్ వర్క్స్ వెంటనే పూర్తి చేయాలి: కమిషనర్

79చూసినవారు
గుంటూరు: ప్యాచ్ వర్క్స్ వెంటనే పూర్తి చేయాలి: కమిషనర్
గుంటూరులోని ప్రధాన రహదారుల్లో ప్యాచ్ వర్క్స్, వీధి దీపాల నిర్వహణను ఇంజినీరింగ్ అధికారులు నిరంతర ప్రక్రియగా చేపట్టాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ప్రతి రోజు ఆయా అంశాలపై సమీక్ష చేస్తామని చెప్పారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్