గుంటూరు: జీజీహెచ్ లో రోగులకు ఓపీ కష్టాలు

69చూసినవారు
గుంటూరు సర్వజన ఆస్పత్రిలో మంగళవారం జిల్లా నలుమూలల నుండి వచ్చే రోగులకు ఓపీ కష్టాలు ఎదురయ్యాయి. ఓపీ చీటీ రాయించుకుందామని క్యూ లైన్ లో ఉన్న రోగులకు కంప్యూటర్లు మొరాయించటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకపక్క ఎండ వేడిమి ఉక్కపోతతో రోగులు నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వైద్యశాల ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. ఈ వైద్యశాలలో నిత్యం ఇదే తంతు జరగటం పరిపాటిగా మారింది.

సంబంధిత పోస్ట్