సినీ నటుడు పోసాని కృష్ణమురళీని గుంటూరు జడ్జ్ ఎదుట సీఐడీ పోలీసులు బుధవారం హాజరుపరిచారు. జీజీహెచ్‍కు తీసుకువచ్చిన సీఐడీ పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. జడ్జ్ ఇంటికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఎదుట పోసాని కన్నీరు పెట్టుకున్నారు. 70 ఏళ్ల వయస్సులో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుటే లాయర్లతో అన్నారు.