గుంటూరు చంద్రమౌళి నగర్ పోస్ట్ ఆఫీస్ వద్ద పోస్ట్ మెన్ లు శనివారం రాత్రి ధర్నా చేశారు. ఆదివారం కూడా విధులు నిర్వహించాలని సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ (ఎస్పీ) చెప్పడంతో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ఎస్పీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆదివారం సెలవు ఇవ్వకుండా పనులు చేయించడం దారుణమని వారు మండిపడ్డారు.