రైతులు పండించిన మిర్చికి గిట్టుబాటు ధర లేదని మిర్చి యార్డ్ బయట రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంటసేపు రోడ్డుపై నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు నల్లపాడు సీఐ వంశీధర్ వెళ్లి వారితో చర్చించారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, రవాణా సౌకర్యం ఆగిపోయిందన్నారు. మిర్చి రైతులు తమ సమస్య తీర్చే వరకు ఇక్కడ నుంచి లేచేది లేదని కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.