కేంద్రం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలకు సిద్ధంగా లేదని, కార్పొరేట్ల ఆకాంక్ష మేరకే హత్యలు జరుగుతున్నాయని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ఆరోపించింది. ఆదివారం గుంటూరు బ్రాడీపేటలోని గోల్డెన్ పార్క్ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. జూన్ 22న కామ్రేడ్ నంబళ్ల కేశవ రావు, తెంటు లక్ష్మి వెంకట నరసింహా చలం సంస్మరణలో గుంటూరు ఎన్. జీ. ఓ కళ్యాణ మండపంలో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.