గుంటూరులోని ప్రభుత్వ పొగాకు బోర్డు కార్యాలయంలో పొగాకు కొనుగోలుపై సమీక్ష సమావేశం జరిగింది. పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ పలు రైతు సంఘాల నాయకులు, రైతులతో బుధవారం సమావేశం నిర్వహించారు. నల్ల బర్లీ పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్, మాజీమంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ శోభా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.