గుంటూరు: రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు: చంద్రబాబు

84చూసినవారు
గుంటూరు: రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు: చంద్రబాబు
గుంటూరులో నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రధాని మోదీ విశాఖకు వచ్చి రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని తెలిపారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్