ప్రపంచ యోగా దినోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద యోగా ఆసనాల ప్రతిమలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు 15 రోజుల నుంచి చురుగ్గా కొనసాగుతున్నాయి. గుంటూరు పోలీస్ సింబల్ మరియు యోగా ఆసనాల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. త్వరలో ఉన్నతాధికారులు ఈ ప్రతిమలను ఆవిష్కరించనున్నారు.