గుంటూరు నగరంలో ఓ అనుమానాస్పద మృతదేహం కలకలం రేపింది. శనివారం శ్రీనగర్‌లో గుర్తుపట్టలేని స్థితిలో పడిపోయి ఉన్న వ్యక్తిని చూసిన స్థానికులు వెంటనే అరండల్ పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం 108 అంబులెన్సులో మృతదేహాన్ని పోస్టుమార్టుకి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.