కూటమి ప్రభుత్వం అడగని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా వాలంటీర్లకు అన్యాయం చేసిందని ఏపీ గ్రామ, వార్డ్ వాలంటీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హుమాయున్ భాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎంసీ కార్యాలయం వద్ద నుంచి గుంటూరు కలెక్టరేట్ వరకు శనివారం వాలంటీర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా భాషా మాట్లాడుతూ. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లతో ఉద్యమిస్తామన్నారు.