మహిళల అభ్యున్నతి కోసం జ్యోతిరావ్ పూలే-సావిత్రి భాయ్ పూలే దంపతులు చేసిన కృషి ఎనలేనిదని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. జ్యోతిరావ్ పూలే వర్ధంతి సందర్భంగా గురువారం హిందూ కాలేజ్ సిగ్నల్స్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ నివాళులర్పించారు. ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ మహానీయుల త్యాగాలను మరవకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు.