వర్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గుంటూరులో భారీ నిరసన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వర్ఫ్ బోర్డు బిల్లు ముస్లింల సమస్య కాదు అని, రాజ్యాంగ సమస్య అని అన్నారు. అన్ని వర్గాల ఆస్తులను దోచుకొని బడా కార్పొరేట్ లకు దోచిపెట్టే చర్య అని ఆరోపించారు. దీనిపై తమ పార్టీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిందని నారాయణ అన్నారు.