అశ్లీల వెబ్ సైట్లకు వీడియోలు సరఫరా చేస్తున్న ముఠాను గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ వీడియోలతో పాటు లైవ్ షోస్ ను వెబ్ సైట్లకు ఇస్తున్నారని వెల్లడించారు. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని, గుంతకల్ కు చెందిన లూయిస్ కాల్ సెంటర్ నడుపుతూ అక్కడ పని చేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడని చెప్పారు. వీటిని నిషేధిత అశ్లీల వెబ్ సైట్స్ కు విక్రయిస్తున్నాడని, గుంతకల్ కు చెందిన లూయిస్, శ్రీకాకుళంకు చెందిన గణేష్, జ్యోత్స్న లను అరెస్ట్ చేశామన్నారు.