ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రశ్నిస్తే వాటిని పరిష్కరించకపోగా, విధుల నుంచి తప్పించడం దుర్మార్గమైన చర్య అని సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మండిపడ్డారు. ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయుసి మంగళగిరి డిపో సెక్రటరీ వి. నాగేశ్వరరావును సస్పెండ్ చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు బస్టాండ్ ఎదుట గురువారం రిలే దీక్ష చేపట్టారు.