ప్రత్తిపాడు మండలానికి చెందిన రాయపాటివారిపాలెంలో వడదెబ్బతో ఓ మహిళ మృతిచెందిన విషాద సంఘటన బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ (65) బుధవారం మధ్యాహ్నం తీవ్ర ఎండల మధ్య ఇంటి నుంచి బయటకు వెళ్లిన అనంతరం అస్వస్థతకు గురై క్షణాల్లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.