వడ్డెర వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మల్లెల ఈశ్వరరావు గురువారం తూర్పు గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యే ఈశ్వర రావును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వడ్డెరల సంక్షేమానికి కృషి చేయాలని, వారి అవసరాలను గుర్తించి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆయనకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.