సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ–సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ పాల్గొని, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక మేలైన అడుగని పేర్కొన్నారు.