మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో ఈనెల 13వ తేదీన మంత్రి నారా లోకేశ్ వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనుండటంతో, కార్యక్రమ ఏర్పాట్లను మున్సిపల్ కమీషనర్ అలీం భాషా శనివారం సమీక్షించారు. అవసరమైన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా డీఈఈ రమేష్, ఏడీ హార్టికల్చర్, ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.