విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈనెల 29, 30 తేదీల్లో గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17239)ను రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి శుక్రవారం తెలిపారు. ఈ రైలు(17240) తిరుగు ప్రయాణంలో ఈనెల 30, అక్టోబరు 1వ తేదీన నడవదని చెప్పారు. అదేవిధంగా విశాఖపట్నం-గుంటూరు-విశాఖపట్నం మధ్య నడిచే ఉదయ్ ఎక్స్ ప్రెస్ ను ఈనెల 30వ తేదీన రద్దు చేసినట్లు పేర్కొన్నారు.