మంగళగిరిలో గంజాయి విక్రయదారులు అరెస్ట్

75చూసినవారు
మంగళగిరిలో గంజాయి విక్రయదారులు అరెస్ట్
మంగళగిరి రూరల్ పోలీసులు కాజా టోల్ ప్లాజా వద్ద ముగ్గురు గంజాయి విక్రయదారులను బుధవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 500 గ్రాముల హైడ్రో గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. ముఠాను అదుపులోకి తీసుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్‌ను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.

సంబంధిత పోస్ట్