నూజెండ్ల మండలం, దాట్లవారిపాలెంకి చెందిన ఓ రైతు గేదెను బుధవారం పిచ్చి కుక్క కరవడంతో మృత్యువాతపడింది. ఆ గేదెకు బీమా ఉండటంతో రైతుకు రూ. 60వేల పరిహారం లభించింది. దీంతో రైతుకు కొంత ఆర్థికంగా ఊరట లభించినట్లు తెలిపారు. పశు పోషకులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ పశువులకు ఇన్స్యూరెన్స్ చేయించుకోవాలని పశువైద్యాధికారి శివాజీ చెప్పారు.