గుంటూరు జీజీహెచ్ లో ఒపీ (ఔట్ పేషెంట్) సేవలు పొందాలంటే యుద్ధం చేయాల్సి వస్తోందని ప్రజలు మంగళవారం వాపోతున్నారు. అక్కడ పని చేయని కంప్యూటర్లు, సరిపోని సిబ్బందితో తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. బారులు తీరిన క్యూలలో నిరీక్షిస్తూ, వైద్య సేవలు అందక అల్లాడిపోతున్నట్లు ఆరోపించారు. కేవలం కౌంటర్లు పెడితే సరిపోదని, సిబ్బంది సంఖ్యను పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.