పెదకూరపాడులో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రైతులకు చెక్కల గొర్రులు, విత్తనాల గొర్రులు, తైవాన్ స్ప్రేయర్లను బుధవారం పంపిణీ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, పంటల దిగుబడిని పెంచేందుకు సబ్సిడీతో పరికరాలు అందజేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ట్రాక్టర్లు, త్రెషర్లు, డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక పరికరాలపై కూడా సబ్సిడీ కల్పిస్తుందని చెప్పారు.