లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ఆప్కాస్ సంస్థను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించవద్దని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జరగనున్న దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు సమ్మె నోటీసు అందించారు. మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికులపై దాడి చేస్తోందని ఆరోపించారు. పాత హామీలు అమలు చేయాలని, పర్మినెంట్, మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.