గుంటూరులో పోస్ట్ మెన్లు నిరసన ప్రదర్శన

380చూసినవారు
గుంటూరు చంద్రమౌళి నగర్ పోస్ట్ ఆఫీస్ వద్ద శనివారం రాత్రి పోస్ట్ మెన్ లు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆదివారం కూడా విధులు నిర్వహించాలని సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ (ఎస్పీ) చెప్పడంతో నిరసన వ్యక్తం చేస్తున్న పోస్ట్ మెన్లు ముక్కుమ్మడిగా ఆందోళన చేపట్టారు. సూపర్డెంట్ పై వ్యతిరేక నినాదాలు చేసి ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్