ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ అధ్యక్షతన కాకుమాను మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బుధవారం జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. విభేదాలకు తావులేకుండా సంఘటితంగా పని చేయాలని సూచించారు.