గుంటూరులోని రాజీవ్ గాంధీనగర్ లో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఓ లారీని అరండల్ పేట పోలీసులు మంగళవారం తనిఖీ చేసి 40 బస్తాల రేషన్ బియ్యంతో పట్టుకున్నారు. ఈ బియ్యం వెనిగండ్లకు తరలిస్తున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న సరుకును రెవెన్యూ అధికారులకు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.