వట్టిచెరుకూరు మండలంలో గాలివాన బీభత్సం

81చూసినవారు
వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు - అనంతవరప్పాడు మధ్య గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులకు ఒక పెద్ద చెట్టు రోడ్డుపై ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటన వలన ఆ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్